
చైతన్య రథం, యువతరం కదిలింది లాంటి విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం తల్లిగారైన ధవళ సరస్వతి(86) శనివారం ఉదయం నర్సాపూర్ లో కన్నుమూశారు. దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు కాగా రెండవ కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా, మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు. నాలుగవ కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు నర్సాపూర్‌లో జరుగుతాయని ధవళ సత్యం తెలియజేసారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.