కొత్తవారి కేరింత | Dil Raju's 'Kerintha' launched | Sakshi
Sakshi News home page

కొత్తవారి కేరింత

Jun 9 2014 10:20 PM | Updated on Sep 2 2017 8:33 AM

కొత్తవారి కేరింత

కొత్తవారి కేరింత

ఔత్సాహిక నటీనటులే ప్రధాన పాత్రధారులుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కేరింత’. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది.

 ఔత్సాహిక నటీనటులే ప్రధాన పాత్రధారులుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కేరింత’. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చారు. ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వస్తున్న 18వ చిత్రమిది. రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశాం.
 
 కొత్తవాళ్లు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హంట్ నిర్వహించి మరీ ఎంపిక చేశాం. మా సంస్థలో వచ్చిన ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం చిత్రాల తరహాలో కొత్తదనం ఉండే సినిమా ఇది. ఈ నెల 23 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. సెప్టెంబర్‌లో పాటలను, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: విశ్వ.
 

Advertisement
 
Advertisement
Advertisement