మస్త్‌ బిజీ

Dil Raju bringing Shraddha Srinath for Naga Chaitanya - Sakshi

బ్రేక్‌ వేయకుండా రయ్‌రయ్‌ మంటూ కెరీర్‌ ఎక్సలేటర్‌ను తొక్కేస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాదిలో ఆల్రెడీ ‘మజిలీ’తో సక్సెస్‌ అందుకున్నారాయన. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్‌లో వెంకటేశ్‌తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్‌ హాఫ్‌లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం పూర్తి కాగానే నూతన దర్శకుడు శశితో ఓ సినిమా స్టార్ట్‌ చేయనున్నారు.

‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫుల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తారు. సో.. ఈ ఏడాదంతా ఆయన మస్త్‌ బిజీబిజీ అన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top