breaking news
Director Shashi
-
మస్త్ బిజీ
బ్రేక్ వేయకుండా రయ్రయ్ మంటూ కెరీర్ ఎక్సలేటర్‌ను తొక్కేస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాదిలో ఆల్రెడీ ‘మజిలీ’తో సక్సెస్ అందుకున్నారాయన. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్లో వెంకటేశ్‌తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పూర్తి కాగానే నూతన దర్శకుడు శశితో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తారు. సో.. ఈ ఏడాదంతా ఆయన మస్త్ బిజీబిజీ అన్నమాట. -
శశి దర్శకత్వంలో ఉదయనిధి
దర్శకుడు శశి, నటుడు ఉదయనిధి స్టాలిన్ల రేర్ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రోజాకూటం, సొల్లామలే, డిష్యుం, పూ తదితర వైవిధ్యభరిత కథా చిత్రాలను రూపొందించిన శశి ఇటీవల సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని హీరోగా తెరకెక్కించిన పిచ్చైక్కారన్ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. దీంతో శశి తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. సక్సెస్ చిత్రాల దర్శకులపై వాలిపోయే నటుడు ఉదయనిధి స్టాలిన్ శశి దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యిపోయారనే టాక్ వినిపిస్తోంది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ తన సొంత నిర్మాణ సంస్థలోనే నటిస్తున్న ఉదయనిధి స్టాలిన్ బయటి సంస్థలో నటించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ మనిదన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హన్సిక నాయకి. ఇక శశి దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.