పది రోజులు.. మూడు సినిమాలు | Dhanush's next with Ramkumar to be a fantasy | Sakshi
Sakshi News home page

పది రోజులు.. మూడు సినిమాలు

Jan 5 2019 5:44 AM | Updated on Jan 5 2019 5:44 AM

 Dhanush's next with Ramkumar to be a fantasy - Sakshi

విష్ణు విశాల్‌ హీరోగా రామ్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రాక్షసన్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు రామ్‌కుమార్‌ మంచి చాన్స్‌ను కొట్టేశారు. మాస్‌ హీరో ధనుష్‌ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్‌ రామ్‌కుమార్‌కి దక్కింది. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. అలాగే సేమ్‌ నిర్మాణసంస్థలో ‘కొడి’ ఫేమ్‌ దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ సినిమా చేయనుండటం విశేషం. ‘‘ధనుష్‌తో రెండు సినిమాలను చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇటీవల ధనుష్‌ హీరోగా ‘అసురన్‌’ మూవీ అనౌన్స్‌మెంట్‌ వచ్చిన విషయం గుర్తుండే ఉంటంది. ఇలా జస్ట్‌ పది రోజుల్లో తన మూడు సినిమాలను అనౌన్స్‌ చేసి అభిమానులను ఖుషీ చేశారు ధనుష్‌. అంతా ఓకే కానీ ధనుష్, నాగార్జునలతో స్టార్ట్‌ అయిన మల్టీస్టారర్‌ మూవీ ఏమైనట్లబ్బా? అని ఆలోచిస్తున్నారు కోలీవుడ్‌ సినీవాసులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement