రఘువరన్ మళ్లీ వస్తున్నాడు | Dhanush VIP 2 telugu version first look | Sakshi
Sakshi News home page

రఘువరన్ మళ్లీ వస్తున్నాడు

Jan 3 2017 11:51 AM | Updated on Sep 5 2017 12:19 AM

రఘువరన్ మళ్లీ వస్తున్నాడు

రఘువరన్ మళ్లీ వస్తున్నాడు

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విఐపి 2. 2014 లో రిలీజ్ అయిన విఐపి సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగానికి వేల్రాజ్ దర్శకత్వం

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విఐపి 2. 2014 లో రిలీజ్ అయిన విఐపి సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగానికి వేల్రాజ్ దర్శకత్వం వహించగా సీక్వల్ను మాత్రం సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు హీరో ధనుష్ స్వయంగా కథలు మాటలు అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

తెలుగులో రఘువరన్ బీటెక్ పేరుతో రిలీజ్ అయిన విఐపి ఘనవిజయం సాధించింది. అందుకే సీక్వల్ను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ధనుష్ సరసన అమలాపాల్తో పాటు బాలీవుడ్ బ్యూటి కాజోల్ మరో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. తొలి భాగంలో కనిపించినట్టుగానే లుంగీతో చిన్న లూనా మోపెడ్ మీద కూర్చున ధనుష్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కబాలి నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న విఐపి 2 సమ్మర్లో రిలీజ్ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement