జూన్ 7న 'విఐపి 2' టీజర్ | Dhanush VIP 2 teaser | Sakshi
Sakshi News home page

జూన్ 7న 'విఐపి 2' టీజర్

Jun 5 2017 4:05 PM | Updated on Sep 5 2017 12:53 PM

జూన్ 7న 'విఐపి 2' టీజర్

జూన్ 7న 'విఐపి 2' టీజర్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విఐపి 2. 2014లో ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విఐపి 2. 2014లో ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు సీక్వల్ గా ఈ సినిమానూ రూపొందిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు ధనుష్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 7న రిలీజ్ చేస్తున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ట్రైలర్ ను రూపొందిస్తున్నారు.

తొలి భాగం టీజర్ కారణంగానే అంతటి ఘనవిజయం సాధించిందన్న నమ్మకంతో ఈ సారి కూడా టీజర్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి ధనుష్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement