కుర్రాడు లోకల్‌

Dhanush Local Boy to release on February 28 - Sakshi

తమిళ ప్రాచీన యుద్ధ విద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లోకల్‌ బాయ్‌’. ధనుష్‌ హీరోగా, మెహరీన్, స్నేహ హీరోయిన్లుగా తెలుగు నటుడు నవీన్‌ చంద్ర విలన్‌గా నటించారు. ఆర్‌.ఎస్‌. దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘పటాస్‌’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టై¯Œ మెంట్స్‌ పతాకంపై సీహెచ్‌ సతీష్‌కుమార్‌ ‘లోకల్‌ బాయ్‌’ పేరుతో ఈ నెల 28న తెలుగులో విడుదల చేస్తున్నారు.

సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. గతంలో ధనుష్, సెంథిల్‌ కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధర్మ యోగి’ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top