వినోదాల దేవదాస్
తనిష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. శ్రీనివాస్‌రెడ్డి గుండ్రెడ్డి దర్శకుడు. వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. నిర్మాణంతర కార్యక్రమాలు చివరి
తనిష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవదాస్ స్టైల్ మార్చాడు’. శ్రీనివాస్‌రెడ్డి గుండ్రెడ్డి దర్శకుడు. వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. నిర్మాణంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని మహానటుడు స్వర్గీయ డా.అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘అక్కినేని ‘దేవదాసు’ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రం ఆడియో వేడుకను ఆయన చేతుల మీదుగానే జరపాలనుకున్నాం. కానీ మా ఆశ అడియాశే అయ్యింది. అందుకే ఆ మహానటుడికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాం. అక్కినేని ‘దేవదాసు’ చిత్రం భావోద్వేగాలతో నిండి ఉన్న కథ అయితే... ఈ సినిమా పూర్తిస్థాయి వినోదంతో కూడుకున్న కథ ’’అని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. ఛాందిని, సన, సుజన, ధన్‌రాజ్, వినోద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చక్రి, సంగీతం: గణ.