ఆ పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది 

Muskan Sethi Talks About Maro Prasthanam Movie - Sakshi

హీరోయిన్‌ ముస్కాన్‌ సేథి

‘‘మరో ప్రస్థానం’ సినిమా నా కెరీర్‌లో ల్యాండ్‌ మార్క్‌ అవుతుందని చెప్పగలను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది’’ అని హీరోయిన్‌ ముస్కాన్‌ సేథి అన్నారు. ‘పైసా వసూల్, రాగల 24 గంటల్లో’ చిత్రాల ఫేమ్‌ ముస్కాన్‌ సేథి నటించిన తాజా చిత్రం ‘మరో ప్రస్థానం’. తనీష్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్‌ కిరణ్‌ సమర్పణలో మిర్త్‌ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న థియేటర్‌లలో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హీరోయిన్‌ ముస్కాన్‌ సేథి మాట్లాడుతూ–‘‘ఎమోషనల్‌గా సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఇందులో నేను యాక్షన్‌ సీన్స్‌లో కూడా నటించా. ఫస్ట్‌ టైమ్‌ ఇటువంటి క్యారెక్టర్‌ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్ని సీన్స్‌లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్‌ నైట్‌ షూట్‌ కూడా చేశాం. రీల్‌ టైమ్‌ రియల్‌ టైమ్‌ ఒకటే కావడం ఈ సినిమా ప్రత్యేకత. సింగిల్‌ షాట్‌లో చేసిన మొదటి సినిమా ఇదే కావడం మరో విశేషం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ‘మరో ప్రస్థానం’ లో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.. థియేటర్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎదురు చూస్తున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top