హీరోగా అవకాశం వస్తే చేస్తా: నటుడు నర్సింగ్ | definantly do hero role if i will get a chance: actor narsing | Sakshi
Sakshi News home page

హీరోగా అవకాశం వస్తే చేస్తా: నటుడు నర్సింగ్

Jan 27 2015 7:36 PM | Updated on Sep 2 2017 8:21 PM

తెలంగాణ రాష్ట్రంలో సినిమా క్యారక్టర్‌ ఆర్టిస్టులకు మంచి అవకాశం లభిస్తుందని రచ్చరంభోల సినిమాలో విలన్ పాత్ర చేసిన నటుడు నర్సింగ్ మక్కల అన్నారు

మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో సినిమా క్యారక్టర్‌ ఆర్టిస్టులకు మంచి అవకాశం లభిస్తుందని 'రచ్చరంభోల' సినిమాలో విలన్ పాత్ర చేసిన నటుడు నర్సింగ్ మక్కల అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలో శ్రీ కొండపోచమ్మ జాతర ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఈ ప్రాంతంలోని నటులకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇంత వరకు 8 సినిమాల్లో విలన్ పాత్ర చేశానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రచయితలకు, దర్శకులకు రానున్న కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. హీరోగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement