మాట్లాడుతూనే ఏడ్చేసిన హీరోయిన్ | Deepika Padukone Breaks Down While Talking About Depression | Sakshi
Sakshi News home page

మాట్లాడుతూనే ఏడ్చేసిన హీరోయిన్

Oct 11 2016 12:10 PM | Updated on Sep 4 2017 4:59 PM

మాట్లాడుతూనే ఏడ్చేసిన హీరోయిన్

మాట్లాడుతూనే ఏడ్చేసిన హీరోయిన్

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కంటతటి పెట్టింది. తాను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి పోయిన సందర్భాలు గుర్తు చేసుకొని ఆ సమయంలో తన తల్లి, తండ్రి, సోదరి తన వెంట లేకుంటే తాను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదంటూ గద్గద స్వరంతో చెప్పింది.

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కంటతటి పెట్టింది. తాను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి పోయిన సందర్భాలు గుర్తు చేసుకొని ఆ సమయంలో తన తల్లి, తండ్రి, సోదరి తన వెంట లేకుంటే తాను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదంటూ గద్గద స్వరంతో చెప్పింది. అయితే, ఏ విషయంలో ఒత్తిడికి లోనైందని మాత్రం చెప్పలేదు. 'లివ్ లవ్ లాఫ్' అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా డిప్రెషన్ పై అవగాహనను ప్రారంభించిన సందర్భంగా దీపికా తన గతాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంది.

'ఈరోజు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామనే విషయం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి.మన ముందు పెద్ద పోటీ ప్రపంచం ఉంది. అందులో నుంచి చొచ్చుకొని వెళ్లగలగాలి. అదే మంచిది కూడా. అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో చాలా సున్నిత మనస్తత్వంగలవారిగా మారుతున్నారనే విషయం గుర్తు చేస్తున్నాను. ఏ ఒక్కరూ అలా మారకూడదు. ఈ సమాజానికి చెందిన వాళ్లం కాదనే ఆలోచన ఏ ఒక్కరి మనసులో అస్సలు రానీయకూడదు. మా అమ్మగురించి మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మనాతో లేకుంటే నేను లేను. ఆమె అన్ని వేళలా నాతో ఉంది. అలాగే, నా తండ్రి, సోదరి కూడా. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను' అంటూ దీపికా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement