హాలీవుడ్ సీక్వెల్‌లో దీపిక | deepika padukon to start filming xxx sequel in feb | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సీక్వెల్‌లో దీపిక

Jan 7 2016 11:33 AM | Updated on Sep 3 2017 3:12 PM

హాలీవుడ్ సీక్వెల్‌లో దీపిక

హాలీవుడ్ సీక్వెల్‌లో దీపిక

కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ స్టార్ విన్ డీసిల్తో కలిసి దీపిక దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ స్టార్ విన్ డీసిల్తో కలిసి దీపికా పదుకొనే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే దీపిక మాత్రం తనతో సినిమాపై ఇప్పట్లో ఏం చెప్పలేనంటూ దాటవేసింది. గతంలోనే విన్ డీసిల్ లీడ్ రోల్లో నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో దీపిక నటించాల్సి ఉన్నా... డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది.

విన్ డీసిల్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ xxx సీక్వెల్‌లో దీపిక నటించనుందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. ఫ్యాన్స్తో చాట్ సెషన్ సందర్భంగా దర్శకుడు డిజె కరుసో 'మేం జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం, ఆమె (దీపిక) ఫిబ్రవరిలో షూటింగ్లో జాయిన్ అవుతుంది' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement