కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: నాగ్‌ అశ్విన్‌ | Deepika Padukone Quiet Kalki Movie After Naga Aswin Shares One Post In Social Media, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Nag Ashwin: కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు

Sep 19 2025 9:11 AM | Updated on Sep 19 2025 10:17 AM

Deepika padukone Quiet kalki Movie After Naga aswin Sher One Post In Social Media

కల్కి 2898 ఏడీ మూవీ సీక్వెల్ నుంచి దీపికా పదుకోణెను తప్పించడంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమెను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తొలగించడం సరైన నిర్ణయమే అంటూ ఎక్కువ మంది పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే, ఇదే అంశంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరోక్షంగా కౌంటర్ వేశారు. కల్కి సినిమాలోని ఓ సీన్ పోస్ట్ చేశాడు. దీంతో దీపికను ఉద్దేశించే నాగ్‌ అశ్విన్‌ ఇలా షేర్‌ చేశాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

నాగ్ అశ్విన్ తన సోషల్‌మీడియా ఖాతాలో 'కల్కి 2898 ఏడీ' లోని కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను పంచుకున్నాడు. అయితే, దానిని మొదట ఒక అభిమాని తన పేజీలో షేర్‌ చేసుకున్నాడు. దానినే నాగ్‌ అశ్విన్‌ పోస్ట్‌ చేశాడు. కల్కి 2898 ఏడీలో కృష్ణుడి ఎంట్రీ సీన్‌లో ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..’ అని అశ్వ‌త్థామకు కృష్ణుడు చెప్పే డైలాగును ఆయన పంచుకోవడంతో పాటు ఇలా క్యాప్షన్‌ ఇచ్చారు. అందులో ఏముందంటే.. "జరిగిపోయిన దానిని మీరు ఎప్పటికీ మార్చలేరు.. కానీ, తర్వాత ఏం జరగాలనేది మాత్రం మీరు ఎంచుకోవచ్చు" అని రాసి ఉంది.  

దీపికా పదుకొణెను ఉద్దేశించే ఆయన ఇలా పోస్ట్‌ చేశారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. పారితోషికం, పని గంటల కారణంగానే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. అయితే, కల్కి సినిమాలో ఆమె భాగం అయినప్పుడు చాలా గౌరంగానే మేకర్స్‌ చూసుకున్నారు. దీపికా మొదట కల్కి సెట్స్‌లో అడుగుపెడుతానే వెండి వస్తువులు, గాజులు, పట్టు చీరతో  నిర్మాత స్వప్న దత్‌ స్వాగతం పలికారు. అంతలా అమెను గౌరవించారు. అయితే, ఇలా వారి స్నేహం బ్రేక్‌ కావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement