విలన్గా మరో హీరో..?

విలన్గా మరో హీరో..?


సీనియర్ హీరోలతో పాటు పెద్దగా ఫాంలోని లేని హీరోలందరూ ఇప్పుడు నెగెటివ్ రోల్స్ పై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ వారసుడు చేరబోతున్నాడట. చాలా కాలం కిందటే గ్రీకువీరుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దాసరి అరుణ్ కుమార్. దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా.. ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు అరుణ్.దీంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల దాసరి మరణించిన సమయంలో తన నాన్న కోరి నన్ను నటుడిగా చూడటమే అని చెప్పిన అరుణ్ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో దాసరి అరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అరుణ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అరుణ్ కు నటుడిగా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top