కాజల్‌ అగర్వాల్‌కు సమన్లు?

Crime Branch Is Reportedly Preparing To Summon Actress Kajal Aggarwal - Sakshi

సాక్షి, పెరంబూరు: నటి కాజల్‌ అగర్వాల్‌కు క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు సమన్లు పంపడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కమలహాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌లో గత నెల 19వ తేదీన క్రేన్‌ కిందపడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో  ముగ్గురు యూనిట్‌ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం ఘటికలు మిగిలిన చిత్ర యూనిట్‌ సభ్యులను వెంటాడుతూనే ఉన్నాయి.

ప్రమాద సంఘటన కేసును క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న వారిని విచారించారు. అంతేకాకుండా చిత్ర దర్శకుడు శంకర్, కథానాయకుడు కమలహాసన్‌కు సమన్లు జారీచేశారు. దర్శకుడు శంకర్, ఆ తరువాత నటుడు కమలహాసన్‌ చెన్నైలోని క్రైమ్‌బ్రాంచ్‌ అధికారులు ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్నారు. తదుపరి ఆ ఘటన ప్రాంతంలో ఉన్న ఇండియన్‌–2 చిత్ర కథానాయకి కాజల్‌అగర్వాల్‌ను విచారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు అధికారులు సమన్లను జారీ చేయనున్నట్లు తాజా సమాచారం.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top