ఇల్లు ఖాళీ చేయండి : నటుడు తల్లికి హైకోర్టు సూచన | Court orders YashMother to vacate house Karnataka | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లోగా అద్దె చెల్లించి ఇల్లు ఖాళీ చేయండి

Sep 6 2018 1:47 PM | Updated on Sep 6 2018 1:47 PM

Court orders YashMother to vacate house Karnataka - Sakshi

సాక్షి బెంగళూరు: డిసెంబర్‌లోగా ఇంటి అద్దె చెల్లించి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని రాకింగ్‌ స్టార్‌ యశ్‌ తల్లి పుష్పకు హైకోర్టు బుధవారం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.  వివరాలు..2010, అక్టోబర్‌ 16 నుంచి కత్రిగుప్పేలోని తమ ఇంటిలో  పుష్ప నివాసం ఉంటూ అద్దె చెల్లించడం లేదని, అద్దె కోసం వెళితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇంటి యజమాని మునిప్రసాద్‌ గిరినగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  కేసును విచారించిన సిటీ సివిల్‌ కోర్టు... మూడు నెలల్లో ఇంటి అద్దె రూ. 9.60 లక్షలను చెల్లించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆదేశాలను సవాలు చేస్తూ యశ్‌ తల్లి పుష్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బోపణ్ణ, జస్టిస్‌ శ్రీనివాస్‌ హరీశ్‌ కుమార్‌ల ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. అద్దె మొత్తం రూ. 23.27 లక్షలను తక్షణమే చెల్లిస్తే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉండొచ్చని, లేదంటే డిసెంబర్‌లోగా అద్దె మొత్తం చెల్లించి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని పుష్పకు హైకోర్టు ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement