నాకు అప్పుడే 14 ఏళ్లు! | completed 14 years of journey, tweets allari naresh | Sakshi
Sakshi News home page

నాకు అప్పుడే 14 ఏళ్లు!

May 10 2016 5:14 PM | Updated on Sep 3 2017 11:48 PM

నాకు అప్పుడే 14 ఏళ్లు!

నాకు అప్పుడే 14 ఏళ్లు!

మొదటి సినిమాలో నటించడం అంటే.. నటుడిగా అప్పుడే జన్మ ఎత్తడం. ఆ లెక్కన చూసుకుంటే అల్లరోడికి అప్పుడే 14 ఏళ్లు నిండిపోయాయి.

మొదటి సినిమాలో నటించడం అంటే.. నటుడిగా అప్పుడే జన్మ ఎత్తడం. ఆ లెక్కన చూసుకుంటే అల్లరోడికి అప్పుడే 14 ఏళ్లు నిండిపోయాయి. అవును.. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ మొదటి సినిమా విడుదలై ఇప్పటికి సరిగ్గా 14 ఏళ్లు గడిచిందట. ఆ విషయాన్ని నరేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 14 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు తెలుగు సినిమా పరిశ్రమలో తాను ప్రయాణం మొదలుపెట్టానని, తన అల్లరి సినిమా విడుదలైందని తెలిపాడు.

హాస్య భరిత చిత్రాల దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకుగా తెరంగేట్రం చేసిన నరేష్.. తన మొదటి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. కేవలం హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా.. తనలోని నటనా నైపుణ్యాన్ని చూపించే వైవిధ్యభరితమైన సినిమాల్లో కూడా నటించి తానేంటో చూపించాడు. ఇన్నాళ్లుగా తనకు అపారమైన మద్దతు ఇచ్చినందుకు అందరికీ ట్విట్టర్ ద్వారా నరేష్ థాంక్స్ చెప్పాడు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని కూడా తెలిపాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement