నవ్వులే....నవ్వులు! | Comedy thriller movie of banthipula janaki | Sakshi
Sakshi News home page

నవ్వులే....నవ్వులు!

Mar 11 2016 11:19 PM | Updated on Sep 3 2017 7:30 PM

నవ్వులే....నవ్వులు!

నవ్వులే....నవ్వులు!

బుల్లితెరపై తమ హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్న ధన్‌రాజ్, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘రాకెట్’ రాఘవ, ‘సుడిగాలి’ సుధీర్ వెండితెరపై సందడి చేయనున్నారు.

బుల్లితెరపై తమ హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్న ధన్‌రాజ్, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘రాకెట్’ రాఘవ, ‘సుడిగాలి’ సుధీర్ వెండితెరపై సందడి చేయనున్నారు. వీరి కాంబినేషన్‌లో నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణిరామ్ నిర్మిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. దీక్షాపంత్ కథా నాయిక. ఈ చిత్రం షూటింగ్  80 శాతం పూర్తయింది.  దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాదింలో విజయం సాధించే  చిత్రాల జాబితాల్లో కచ్చితంగా ఉంటుం దన్న నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్.

Advertisement
 
Advertisement
Advertisement