హీరోగా కమెడియన్ మరో ప్రయత్నం..! | comedian saptagiri starts new movie | Sakshi
Sakshi News home page

హీరోగా కమెడియన్ మరో ప్రయత్నం..!

Jun 22 2017 2:10 PM | Updated on Sep 5 2017 2:14 PM

హీరోగా కమెడియన్ మరో ప్రయత్నం..!

హీరోగా కమెడియన్ మరో ప్రయత్నం..!

కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, హీరోగా మారేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటిరే సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోగా

కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, హీరోగా మారేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటిరే సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోగా మారిన ఈ కామెడీ స్టార్ ఇప్పుడు మరో సినిమాను మొదలు పెట్టాడు. తొలి సినిమా తరహాలోనే రెండో సినిమాకు కూడా తన పేరునే సినిమా టైటిల్గా ఫిక్స్ చేశాడు.

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన జాలీ ఎల్ ఎల్ బీ ఇన్సిపిరేషన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'సప్తగిరి ఎల్ఎల్బి' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు లాంచనంగా ప్రారంభించిన ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement