నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది : హీరో గౌతమ్ | Comedian Brahmanandam Son Hero Gautham Press Release | Sakshi
Sakshi News home page

Jan 17 2019 3:23 PM | Updated on Jan 17 2019 3:38 PM

Comedian Brahmanandam Son Hero Gautham Press Release - Sakshi

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనయుడు, హీరో గౌతమ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ‘కొన్ని నెలలుగా  ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు  బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు.

దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో    సోమవారం (14.1.19) నాడు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా,  బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది’ అని తెలిపారు.

‘నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి  అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల  నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది, వారందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement