కిక్ ఇచ్చే కాంబినేషన్ | Combination which gives kick | Sakshi
Sakshi News home page

కిక్ ఇచ్చే కాంబినేషన్

May 28 2014 10:43 PM | Updated on Aug 29 2018 2:33 PM

కిక్ ఇచ్చే కాంబినేషన్ - Sakshi

కిక్ ఇచ్చే కాంబినేషన్

నందమూరి కల్యాణ్‌రామ్ అటు హీరోగానూ, నిర్మాతగానూ తన ప్రతిభ చాటుతున్నారు.

నందమూరి కల్యాణ్‌రామ్ అటు హీరోగానూ, నిర్మాతగానూ తన ప్రతిభ చాటుతున్నారు. తన తాతగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ సంస్థలో వచ్చిన చిత్రాలన్నింటిలోనూ తనే కథానాయకుడు. ఈసారి మాత్రం పంథా మార్చారు. తను కేవలం నిర్మాణానికే పరిమితమవుతూ రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
 
 కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది కూడా అంతే విభిన్నంగా ఉంటుంది. అయితే ఇది ‘కిక్’కి సీక్వెల్ కాదు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు తెలియజేస్తాం. వచ్చే నెలలో ముహూర్తం జరిపి, ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. కిక్, రేసుగుర్రం వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement