కొడుకు సినిమాపై ఓ కన్నేసిన చిరంజీవి

కొడుకు సినిమాపై ఓ కన్నేసిన చిరంజీవి - Sakshi


నిన్న మొన్నటి వరకూ రాజకీయాలతో బిజీగా ఉన్న కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొడుకు సినిమాతో కుస్తీ పడుతున్నారు.  రామ్ చరణ్ తాజా చిత్రం  'గోవిందుడు అందరివాడేలే' పై చిరు ఓ కన్నేసి ఉంచారు. ఓవైపు చెర్రీ విదేశాల్లో సినిమా షూటింగ్తో బిజీగా ఉంటే...మరోవైపు చిరంజీవి గోవిందుడు కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ పనులను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారట.  చెర్రి  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో...సినిమా ట్రైయిలర్ దగ్గర నుంచి మిగతా పనులను నాన్నకు అప్పగించేసి నిశ్చంతగా ఉన్నాడట. ఇదే విషయాన్ని చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే నెల వరుస సెలవులు రావటంతో ఈ సినిమాకు కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి, దసరా, ఆ తర్వాత వీకెండ్, అనంతరం బక్రీద్...ఇలా వరుసపెట్టి ఆరు రోజులు సెలవులు రావటం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు  వచ్చే అవకాశం ఉండటం చెర్రీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top