కష్టాల్లో సీనియర్‌ నటి.. ఆదుకున్న చిరంజీవి | Chiranjeevi Helps Senior Actress Subhashini | Sakshi
Sakshi News home page

Apr 25 2018 6:11 PM | Updated on Aug 28 2018 4:32 PM

Chiranjeevi Helps Senior Actress Subhashini - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘అల్లరి’ సినిమాతో ప్రసిద్ధి పొందిన సీనియర్‌ నటి సుభాషిణీ తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న సీనియర్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకొని.. రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బుధవారం స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి.. ఆమెకు రూ. రెండు లక్షలు అందజేశారు. కష్టాల్లో ఉన్న సీనియర్‌ నటికి చిరంజీవి సాయం అందించడంపై సోషల్‌ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement