నన్ను ప్రోత్సహించిన వారిలో ఆయన ఒకరు : చిరంజీవి

Chiranjeevi Condolence to Madala Ranga Rao - Sakshi

విప్లవ నటుడు మాదాల రంగారావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి మాదాల రంగారావు భౌతికకాయానికి నివాళులర్పించారు.

‘రంగారావు గారు కమిట్మెంట్‌ ఉన్న వ్యక్తి, కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చినా.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం విప్లవాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ ప్రజలను చైతన్య పరిచిన వ్యక్తి ఆయన. ఆర్‌. నారాయణమూర్తి లాంటి వారికి ఆయనే స్ఫూర్తి. నేను ఒంగోలులో ఉన్నప్పుడు మాదాల రంగారావు, టి.కృష్ణ, పోకూరి బాబురావులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నన్ను ఎంకరేజ్‌ చేసిన వాళ్లలో మాదాల రంగారావు ఒకరు’అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top