మెగాస్టార్ వంతు..! | Chiranjeevi buy the first ticket of Darsakudu | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ వంతు..!

Aug 2 2017 11:13 AM | Updated on Sep 17 2017 5:05 PM

మెగాస్టార్ వంతు..!

మెగాస్టార్ వంతు..!

తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోలందరిని వాడేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ మెగాస్టార్ ఈ శుక్రవారం సినిమా

తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోలందరిని వాడేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ మెగాస్టార్ ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫైనల్ గా మెగాస్టార్ ను సీన్ లోకి తీసుకువచ్చాడు. ఇప్పటికే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ లు దర్శకుడు సినిమా ఫంక్షన్లలో సందడి చేయగా ఇప్పుడు మెగాస్టార్ కూడా దర్శకుడు చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఈ సినిమా తొలి టికెట్ ను తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశాడు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ శుక్రవారం (ఆగస్టు 4)న ప్రేక్షకుల ముందుకు వస్తున్న దర్శకుడు స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం సినిమాతో పోటి పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement