'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి'

Chinmayi Sripaada Fires On Lyricist Vairamuthu - Sakshi

చెన్నై: తొమ్మిది మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్న తమిళ సినీ కవి వైరముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. తమిళ భాషకు ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరముత్తును సత్కరించనున్నారు. ఈ విషయం చిన్మయి దృష్టికి రావడంతో ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మీకు ఓ విషయాన్ని గుర్తుచేయాలని అనుకుంటున్నాను. 'ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు. ఆరోపణలు చేసిన వారికే పని దొరక్కుండా చేస్తారు. తమిళ భాష పట్ల వైరాముత్తుకు ఉన్న పట్టును గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తున్నారని నాకు తెలుసు. అదే విధంగా ఉత్తమ కామాంధుడు అనే పురస్కారం కూడా ఇస్తారని ఆశిస్తున్నా' అని సింగర్ చిన్మయి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

చదవండి: ఫ్రీగా పాన్ ఇవ్వలేదని.. ముక్కు, పెదవులు కొరికేశాడు..!

నేను చేసిన ఆరోపణలపై ఎవరూ విచారణ జరపకపోగా ప్రముఖుల చిత్రాల్లో అవకాశాలు ఇస్తూ అతడి ఆగడాలను సమర్ధిస్తున్నారు. లోకమంతా ఆయనకు కీర్తి కండువా కప్పుతోంది. ఇక నాపై కామెంట్స్‌ చేస్తున్న వారికి ఒక్క విషయం చెప్తున్నా.. మీ జీవితంలోనూ వైరముత్తు లాంటి వ్యక్తి ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డానో తెలిసొస్తుంది. అనుభవాన్ని మించిన గురువు మరొకటి ఉండదు. నేను కేవలం న్యాయం కావాలని అడుగుతున్నాను. నా ఆరోపణలు విని ఓ కామాంధుడి అభిమానులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడంలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి. 

చదవండి: మహేంద్రన్‌పై చిన్మయి ఫైర్‌

చదవండి: చిన్నారి హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top