పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ: కరిష్మా కపూర్ | Children's health care: Karisma Kapoor | Sakshi
Sakshi News home page

పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ: కరిష్మా కపూర్

Aug 11 2013 1:01 AM | Updated on Apr 3 2019 6:23 PM

పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ: కరిష్మా కపూర్ - Sakshi

పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ: కరిష్మా కపూర్

తెరపై అమ్మ పాత్రను పోషించి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ నిజ జీవితంలోనూ తన పిల్లల ఆరోగ్యం బాగుండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.

న్యూఢిల్లీ: తెరపై అమ్మ పాత్రను పోషించి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న  బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ నిజ జీవితంలోనూ తన పిల్లల ఆరోగ్యం బాగుండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇంట్లోనే విభిన్నకర వంటకాలు చేస్తూ ఆరోగ్యకరంగా ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకుం టోంది. పిల్లలు సమైర(8), కియాన్ రాజ్‌కపూర్(3)లకు వివిధ రకాల వంటకాల రుచిని చూపిస్తోంది. అన్ని రకాల కూరగాయల ప్రాధాన్యతను వివరిం చి వారు తినేలా ప్రోత్సహిస్తున్నానని తెలిపింది.  
 
 బకోలీ అనే కూరగాయల మొక్క గురించి పిల్లలకు చెబుతానని, దీంతో వారికి  తాము మొక్కలను తింటున్నామనే ఆలోచన కలుగుతోం దని వివరించింది. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు వివిధ రకాల వంటకాలు చేస్తున్నానని తెలి పింది. అయితే ఆహారపట్టికను అనుసరించ ని కరిష్మా తన ప్లేట్ మాత్రం రంగురంగుల కూరగాయలతో ఉండేందుకు ఇష్టపడుతుంది. ‘అన్నం, కూరగాయలు రోజు వారీగా తింటాం. నా ప్లేట్ మాత్రం రంగులమయంగా ఉండేందుకు ఇష్టపడతాను. వివిధ రంగుల్లో ఉండే మిరపకాయలు, సలాడ్‌లపై మక్కువ చూపుతాన’ని ఆమె తెలిపింది. 
 
 నడక, యోగాకు ఎక్కువ ప్రాధాన్యమిస్తానని, తాను యోగా చేసే సమయంలో కూతురు కూడా వచ్చి చేరుతుందని చెప్పింది. ‘పండుగ సమయం, సెలవు రోజుల్లో కొంత ఎక్కు వ ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాను. ఎక్కువగా నల్ల దుస్తులు ధరిస్తాను. రాత్రి పడుకునే సమయంలో సల్వార్ కమిజ్ ధరిస్తాన’ని వివరించింది. ఎక్కువగా నీటిని తీసుకొని శరీర ఆకృతి బాగుండేలా చూసుకుంటానని తెలి పింది. 2003లో ఢిల్లీకి చెందిన వ్యాపారి సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న కరిష్మా.. వైవాహిక విభేదాల కారణంగా గతేడాది విడాకులు తీసుకుంది. 2012 లో తిరిగి 92.7 బిగ్ ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమం బిగ్ మేమ్‌సాబ్ ద్వారా మహిళా శ్రోతలను అలరిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement