అధరం తాంబూలం! | Sakshi
Sakshi News home page

అధరం తాంబూలం!

Published Wed, Aug 3 2016 11:54 PM

అధరం తాంబూలం!

 సెలబ్రిటీలకు స్వేచ్ఛ ఉండదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టిన క్షణం నుంచీ రహస్య కెమేరాలు వెంటాడతాయ్. అది గ్రహించే ప్రముఖులు కూడా అప్రమత్తంగా ఉంటారు. అయినా ఏదో చోట దొరికిపోతారు. ఈ మధ్య ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలానే దొరికిపోయింది. ఈ టీనేజ్ బ్యూటీ ఇటీవల శిఖర్ పహారియా అనే కుర్రాడితో ముద్దుల మూడ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా ఎవరో కెమెరాలో బంధించారు. తీసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా జాన్వీ, శిఖర్‌ల ముద్దూ ముచ్చట తాలూకు ఫొటోను బయటపెట్టారు.

ఇంతకీ ఈ శిఖర్ పహారియా ఎవరంటే.. కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు. ఓ ప్రైవేట్ పార్టీలో జాన్వీ, శిఖర్‌లు ఈ విధంగా పట్టుబడ్డారని టాక్. ప్రస్తుతం జాన్వీ న్యూయార్క్‌లో ఉంది. అక్కడ నటనలో శిక్షణ తీసుకుంటోంది. మరో రెండేళ్ల లోపు తను కథానాయికగా పరిచయమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement