‘ఎన్టీఆర్‌’లో  కొత్తవారి కోసం వేట

A Casting Call To Be Part Of NTR Biopic Movie - Sakshi

నందమూరి తారకరామారావు పేరు తెలియని తెలుగు వారుండరు. సినీ, రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు వారికి రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే. ఎన్టీఆర్‌ చేయని ప్రాత లేదు. వెండితెరపై ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించబోతోన్నారు. బాలకృష్ణ ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్‌’ పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నోరూమర్స్‌ తర్వాత ఈ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 

క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక కథలో, కథనంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉండబోతోన్నాయి. అందుకోసం కొత్తవారిని తీసుకోవాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. ఆసక్తి కలిగిన వారందరకీ ఆహ్వానం పలుకుతూ ఓ ప్రకటను విడుదల చేసింది చిత్రయూనిట్‌. వయసుతో నిమిత్తం లేకుండా...వారు నటిస్తూ తీసిన ఓ 30 సెకన్ల వీడియోను ప్రకటనలో ఇచ్చిన మెయిల్‌ అడ్రస్‌కు పంపాలని కోరారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top