కారు ప్రమాదంలో గాయపడ్డ బోని కపూర్ | Boney Kapoor suffers minor injury in car accident | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదంలో గాయపడ్డ బోని కపూర్

May 14 2014 11:30 PM | Updated on Aug 14 2018 3:22 PM

కారు ప్రమాదంలో గాయపడ్డ బోని కపూర్ - Sakshi

కారు ప్రమాదంలో గాయపడ్డ బోని కపూర్

బాలీవుడ్ నిర్మాత, ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోని కపూర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ముంబై: బాలీవుడ్ నిర్మాత, ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోని కపూర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ముంబైలో జరిగిన కారు ప్రమాదంలో బోని కపూర్ కు స్వల్ప గాయాలైనట్టు ఆయన మేనేజర్ మీడియాకు తెలిపారు. అయితే స్వల్పంగా గాయపడిన బోని కపూర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. 
 
'ముంబైలోని వహి ప్రదేశంలో తేవర్ చిత్ర షూటింగ్ ను ముగించుకుని వస్తుండగా సతారా హైవేపై ట్రాక్టర్ ను బోని కారు ఢికొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారును ఆయన డ్రైవర్ నడుపుతున్నారు. బోని శరీరపు వెనక భాగంలో గాయాలయ్యాయి' అని శ్రీదేవి మేనేజర్ పంకజ్ కర్భందా మీడియాకు సమాచారం అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement