హీరో మాజీ భార్యపై కేసు కొట్టివేత | Bombay HC quashes cheating case against Sussanne Khan | Sakshi
Sakshi News home page

హీరో మాజీ భార్యపై కేసు కొట్టివేత

Aug 26 2016 8:29 AM | Updated on Sep 4 2017 11:01 AM

హీరో మాజీ భార్యపై కేసు కొట్టివేత

హీరో మాజీ భార్యపై కేసు కొట్టివేత

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది.

ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. రెండు నెలల క్రితం ఆమెపై దాఖలైన చీటింగ్ కేసును బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం కొట్టివేసింది. రూ. 1.87 కోట్లకు సుసానే ఖాన్ తమను మోసం చేసిందని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గోవాలో ఛీటింగ్ కేసు పెట్టింది.

ఆమె మోసానికి పాల్పడినట్టు ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నమోదు కాలేదని కోర్టు తెలిపినట్టు సుసానే ఖాన్ తరపు న్యాయవాదులు నితిన్ సర్వేశాయ్, హితేశ్ జైన్ వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ లో ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి అభియోగాలు నమోదుకానప్పుడు కేసు నిలవదని న్యాయస్థానం అభిప్రాయపడిందని తెలిపారు. సివిల్ కేసును పోలీసు యంత్రాంగం అండతో క్రిమినల్ కేసుగా మార్చాలని పిటిషన్లు ప్రయత్నించారని ఆరోపించారు. కాగా, తన గౌరవాన్ని చెడగొట్టేందుకే ఛీటింగ్ కేసు పెట్టారని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదని సుసానే ఖాన్ అంతకుముందు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement