ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

Bollywood WAR Movie teaser Released - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ హృతిక్‌రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటిస్తున్న ‘వార్‌’ చిత్రం టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వాణికపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌ చూస్తుంటే సినిమా ప్రేమికులకు ఓ భారీ కానుకలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్‌లో హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఒకరికొకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వీరోచితంగా కనిపిస్తున్నారు.

ఈ దృష్యాలు యాక్షన్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎవరికి ఎవరు తీసిపోకుండా ఇద్దరు సమవుజ్జీవులుగా పోరాడుతూ కనిపిస్తున్నారు. చిత్ర డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ మాట్లాడుతూ యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాకు వార్‌ అనే టైటిల్‌ సరిగా ప్రతిబింభిస్తుందని, ఇద్దరు స్టార్లను ఒకే సినిమాలో విలన్‌లాగా చూపించాలంటే ఈ టైటిల్‌ మాత్రమే సరిపోతుందని అనిపించిందన్నారు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకులకు ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top