త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు | Bobby Simhaa, Reshmi Menon to tie the knot in January 2016 | Sakshi
Sakshi News home page

త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు

Jul 18 2015 12:46 PM | Updated on Sep 3 2017 5:45 AM

త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు

త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు

ఉరుమీన్ చిత్రం హీరో హీరోయిన్ల ప్రేమకథకు త్వరలోనే శుభం కార్డు పడనుంది. తమిళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా, హీరోయిన రేష్మీ మీనన్ పెళ్లికి ఇరుకుటుంబాలు పెద్దలు ఒకే చెప్పారు.

చెన్నై: మరో సినీ జంట ...త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 'ఉరుమీన్'  చిత్రం హీరో హీరోయిన్ల  ప్రేమకథకు కొద్ది నెలల్లో శుభం కార్డు పడనుంది.  తమిళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా,  హీరోయిన రేష్మీ మీనన్...  ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు  ఒకే చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో వీరి వివాహాన్ని జరిపించేందుకు నిర్ణయించారు.  రెండు కుటుంబాల పెద్దలు... వీరి పెళ్లికి అంగీకరించారని,  ఆగస్ట్లో నిశ్చితార్థం , 2016 జనవరిలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు హీరో బాబీసింహా  తన సన్నిహిత వర్గాలతో పంచుకున్నట్టు సమాచారం.  అయితే ఈ వార్తలపై  రేష్మీ మీనన్ కానీ, బాబీసింహా నుంచీ  ఇప్పటివరకూ ఎలాంటి  స్పందనా రాలేదు.

మరోవైపు ఈ పెళ్లికి  రేష్మి  తల్లిదండ్రులకు పెద్దగా  ఇష్టం లేకపోయినా కూతురు అభీష్టం మేరకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పెద్దలు అంగీకారం ఉన్నా లేకపోయినా, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలన్న ఇద్దరి ప్రయత్నాలు తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించినట్టు సమాచారం. పిజ్జాతో తెరంగేట్రం చేసి జిగర్‌ తండ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న నటుడు బాబిసింహా.  విలక్షణ విలనీయంతో ఆకట్టుకున్న బాబీ ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నారు.

బాబీ సింహా, , రేష్మీ జంటగా నటించిన ఉరుమీన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. బాబిసింహా,రేష్మీమీనన్‌ల తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను బాబిసింహా మిత్రుడు, పిజ్జా, జిగర్‌తండ చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తన భుజస్కంధాలపైన వేసుకుని...వారి ప్రేమను పెళ్లి వరకూ తీసుకు  వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement