ఆ చిత్రంలో నేను నటించలేదు | Sakshi
Sakshi News home page

ఆ చిత్రంలో నేను నటించలేదు

Published Tue, May 17 2016 3:40 AM

ఆ చిత్రంలో నేను నటించలేదు - Sakshi

జాతీయ అవార్డు గ్రహీత నటుడు బాబీసింహా నటించిన తాజా చిత్రం కో-2 ఇటీవల విడుదలై ప్రదర్శింపబడుతోంది. బాబీసింహా పేరు ఇప్పుడు వార్తల్లో మారు మోగుతోంది. ఆయన్ని మరోసారి వివాదాల్లోగా లాగినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఒకసారి ఆయన నటించిన చిత్రానికి ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లించకుండా, ఆయన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించి విడుదల చూసి బాబీసింహాను వివాదాల్లోకి దించినట్లు ప్రచారం హోరెత్తింది.

తాజాగా బాబీసింహా నటించని చిత్రంలో ఆయన నటించినట్లు ప్రచారం చేస్తూ మరోసారి వివాదాల్లోకి దించినట్లు ఆయన వాపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకెళ్లితే మీరా జాగ్రత్తై అనే చిత్రంలో బాబీసింహా నటించినట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది తన దృష్టికి రావడంతో బాబీసింహా దిగ్భ్రాంతికి గురైయారు. వెంటనే స్పందించిన ఆయన నడిగర్‌సంఘంకు పిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను మూడేళ్లుగా దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నానన్నారు. తన సభ్యత్వ నమోదు నంబర్.7871 అని పొందుపరచారు. తన పేరుకు కళంకం ఆపాదించే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు.

కొన్ని రోజులుగా దిన పత్రికల్లో తనకు తెలియని దర్శకుడు, నిర్మాత మీరా జాగ్రత్తై అనే చిత్రంలో తాను నటించినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రకటనల్లో తాను ఇంతకు ముందు నటించిన ఉరుమీన్ చిత్ర ఫొటోలను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి తానా చిత్రంలో నటించనేలేదు. డబ్బింగ్‌కుడా చెప్పలేదు అని తెలిపారు. ఇక పోతే ఆ చిత్రంలో కథానాయకిగా చెప్పబడే నటి మోనీకాను తాను నేరుగా చూసింది కూడా లేదు అన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలను గ్రహించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుకుంటున్నానని బాబీసింహా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement