బ్రూక్ షీల్డ్స్ను చలినుంచి కాపాడిన విక్రం యోగా | Sakshi
Sakshi News home page

బ్రూక్ షీల్డ్స్ను చలినుంచి కాపాడిన విక్రం యోగా

Published Sat, Jan 25 2014 10:13 AM

బ్రూక్ షీల్డ్స్ను చలినుంచి కాపాడిన విక్రం యోగా

చలికాలంలో ఆరోగ్యంగా, వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? విదేశాల్లో అయితే హాయిగా మందు కొడతారని అనుకుంటున్నారు కదూ. కానీ హాలీవుడ్ హీరోయిన్ బ్రూక్ షీల్డ్స్ మాత్రం అలా చేయట్లేదు. ప్రముఖ యోగా గురువు విక్రం చౌధురి రూపొందించిన విక్రం యోగా చేస్తోంది. దీనికే హాట్ యోగా అని కూడా పేరుంది. దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న గదిలో ఈ యోగాను ప్రాక్టీసు చేస్తారు. బాగా చలిగా ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చబరుచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుందట.

48 ఏళ్ల బ్రూక్ షీల్డ్స్ కూడా న్యూయార్క్ నగరంలో బాగా చలిగా ఉండటంతో ఈ క్లాసులకు వెళ్తూ కనిపించినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. నగరంలో బాగా మంచు ఎక్కువ పడుతుండటంతో మఫ్లర్లు, కోట్లు అన్నీ చుట్టుకుని మరీ బ్రూక్ షీల్డ్స్ ఈ క్లాసులకు వెళ్తోంది. బాగీ గ్రే జాగింగ్ బాటమ్స్ ధరించి సరిగ్గా యోగా క్లాసులకు ఎలా వెళ్లాలో అలాగే వెళ్లిందట. మేకప్ ఏమాత్రం వేసుకోకుండా, ఒక చాప కూడా తీసుకుని వెళ్లిందని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement