పెద్ద విలన్ అవుతావన్నారు! | big Villain in Ashish Gandhi | Sakshi
Sakshi News home page

పెద్ద విలన్ అవుతావన్నారు!

Jun 7 2016 11:20 PM | Updated on Sep 4 2017 1:55 AM

పెద్ద విలన్ అవుతావన్నారు!

పెద్ద విలన్ అవుతావన్నారు!

‘‘చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలనే పట్టుదలతోనే ట్రైనింగ్ తీసుకున్నాను’’ అని ఆశిష్ గాంధీ అన్నారు.

‘‘చిన్నతనం నుంచి సినిమాలంటే  ఇష్టం. ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవ్వాలనే పట్టుదలతోనే ట్రైనింగ్ తీసుకున్నాను’’ అని ఆశిష్ గాంధీ అన్నారు. ‘ఓ స్త్రీ రేపు రా’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయయ్యారు. ఇటీవల విడుదలైన ‘శ్రీ శ్రీ’ చేస్తున్నప్పుడు భవిష్యత్తులో చాలా పెద్ద విలన్ అవుతావని కృష్ణగారు అభినందించారని ఆశిష్ చెబుతూ - ‘‘ముంబైలోని రోషన్ తనేజా ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందా. మోడలింగ్  చేస్తుండగానే లఘు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. వాటిని అనిల్ రావిపూడిగారికి చూపిస్తే, ‘పటాస్’లో చాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళంలో ఓ అగ్ర హీరోతో తెరకెక్కుతున్న చిత్రంలో చేస్తున్నా. విలన్‌గానే కొనసాగాలనుకుంటున్నా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement