ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టా : నటి

Big Boss Fame Mumtaj Once Hit Director With Slipper - Sakshi

భారత్‌లో కూడా ‘మీటూ’  ఉద్యమం ఉధృతమైన వేళ క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైన పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ‘ఖుషీ’ సినిమా ఫేం ముంతాజ్ కూడా కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయటపడిన తీరు గురించి చెప్పుకొచ్చారు.

‘అవును నాకు అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. నాతో తప్పుగా ప్రవర్తించినందుకు ఓ దర్శకుడిని చెప్పుతో కొట్టాను. ఈ విషయం నడిగర్‌ సంఘం దృష్టికి తీసుకువెళ్లాను కూడా. వాళ్లు నా సమస్యని పరిష్కరించారు. ఇది జరిగిన తర్వాత కూడా మరో దర్శకుడు అడ్వాంటేజ్‌ తీసుకునే ప్రయత్నం చేశాడు. కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేసా. అంతే ఇక అప్పటి నుంచి నా జోలికి రాలేదు సరికదా.. ఎప్పుడైనా కన్పిస్తే రండి మేడమ్‌, కూర్చోండి, ఏం తీసుకుంటారు అని మరాద్యలు చేసేవాడని’ ముంతాజ్‌ వ్యాఖ్యానించారు.

అయితే మీటూ ఉద్యమాన్ని ఫాలో అవుతున్నారా అడుగగా.. ‘ నిజానికి ఫాలో అవ్వడం లేదు. కానీ ఒకరు మంచి వాళ్లో, చెడ్డవాళ్లో నిర్ణయించే హక్కు మనకైతే లేదు. ఆరోపణలు వచ్చినపుడు బాధితులు, బాధ్యులు ఇద్దరూ మాట్లాడినపుడే ఫలితం ఉంటుంది. అంతేకానీ ఒకరి వర్షన్‌ గురించి మాత్రమే వినడం సబబు కాదని’  ముంతాజ్‌ అభిప్రాయపడ్డారు. కాగా ఎన్నో ప్రత్యేక గీతాల్లో నర్తించి గుర్తింపు పొందిన ముంతాజ్‌.. తాజాగా తమిళ బిగ్‌బాస్‌-2తో మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top