
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డుల వేట మొదలు పెట్టిన భరత్ అనే నేను, బాహుబలి సీరీస్ తరువాత వేగం వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించటం విశేషం.
తొలిరోజు మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా అమెరికాలో రెండు రోజుల్లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. ఇదే హవా కొనసాగితే తొలి వారాంతానికి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఎంటర్ అవుతుందని భావిస్తున్నారు. తొలి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న భరత్ అనే నేను ముందు ముందు మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
#100CroreBharatAneNenu pic.twitter.com/6Yg7NIrJOo
— DVV Entertainment (@DVVEnts) 22 April 2018