భానుప్రియ పనిమనిషి కథ సుఖాంతం | Bhanupriya Clarified Her Maid Case Issue | Sakshi
Sakshi News home page

Jan 27 2019 8:07 AM | Updated on Jan 27 2019 8:07 AM

Bhanupriya Clarified Her Maid Case Issue - Sakshi

పెరంబూరు: నటి భానుప్రియ ఇంటి పనిమనిషి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట, సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి తన కూతుర్ని కొడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణలపై సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసిన విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి భానుప్రియను విచారించడానికి శుక్రవారం చెన్నైకి వచ్చారు. కాగా శనివారం నటి భానుప్రియ చెన్నైలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇంటి పనికి తీసుకొచ్చిన 16 ఏళ్ల యువతి ఇంట్లో దొంగతనానికి పాల్ప డిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని చెప్పారు. తానే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే వద్దని పనిమనిషి తల్లి ప్రభావతి  ఏడ్చిందని తెలిపారు. శుక్రవారం పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వారు  పనిపిల్లను తీసుకెళ్లారని నటి భానుప్రియ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement