‘ఎన్టీఆర్‌’లో బెంగాలీ నటుడు

Bengali Actor Jisshu Sengupta in NTR Biopic - Sakshi

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ, ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం ఓ బెంగాలీ నటుడ్ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ భర్తగా నటిస్తున్న జిష్షు సేన్‌గుప్తాను ఎన్టీఆర్‌లో కీలకపాత్రలకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో ప్రొత్సహించిన ఎల్వీ ప్రసాద్‌ పాత్రలో జిష్షు కనిపించనున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌, రానా దగ్గుబాటి, సచిన్‌ కేడ్కర్‌లు కీలక పాత్రలో నటించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top