నాలుగు రోజుల్లో 175 కోట్ల కలెక్షన్లు! | 'Bang Bang!' mints Rs.175.61 crore gross worldwide | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో 175 కోట్ల కలెక్షన్లు!

Oct 6 2014 3:08 PM | Updated on Sep 2 2017 2:26 PM

నాలుగు రోజుల్లో 175 కోట్ల కలెక్షన్లు!

నాలుగు రోజుల్లో 175 కోట్ల కలెక్షన్లు!

హృతిక్ రోషన్ - కత్రినా కైఫ్ జంటగా మరోసారి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 175.61 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.

సినిమా రివ్యూలలో ఎన్ని విమర్శలు వచ్చినా, అసలు ఎందుకు చూడాలో అర్థం కావట్లేదంటూ విమర్శకులు జోకులు పేల్చినా.. హృతిక్ రోషన్ - కత్రినా కైఫ్ జంటగా మరోసారి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం మాత్రం కోట్లు కుమ్మరిస్తోంది. 140 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 175.61 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇందులో భారత దేశంలో 134.47 కోట్లు, విదేశాల్లో 41.14 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా.. హాలీవుడ్లో వచ్చిన 'నైట్ అండ్ డే' సినిమాకు రీమేక్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఎంతో మెచ్చుకున్నారు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో అన్నిచోట్లా సూపర్ స్టార్ అనిపించాడని, అతడి ప్రతి ఒక్క కదలికా సినిమాకు  డబ్బులు తెస్తోందని ట్వీట్ చేశాడు. ఈ యాక్షన్ థ్రిల్ల్రర్ సినిమాలో డానీ డెంజోంగ్పా, జావేద్ జాఫ్రీ, దీప్తి నావెల్, కన్వల్జిత్ సింగ్, జిమ్మీ షేర్గిల్ లాంటి అలనాటి నటులు కూడా నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement