రూ.290 కోట్లు దాటిన 'బ్యాంగ్ బ్యాంగ్' వసూళ్లు ! | 'Bang Bang!' crosses Rs.150 crore in India | Sakshi
Sakshi News home page

రూ.290 కోట్లు దాటిన 'బ్యాంగ్ బ్యాంగ్' వసూళ్లు !

Oct 13 2014 1:35 PM | Updated on Sep 2 2017 2:47 PM

రూ.290 కోట్లు దాటిన 'బ్యాంగ్ బ్యాంగ్' వసూళ్లు !

రూ.290 కోట్లు దాటిన 'బ్యాంగ్ బ్యాంగ్' వసూళ్లు !

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో నిర్మించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 290.97 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా  ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో నిర్మించిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 290.97 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 154.68 కోట్ల రూపాయలు (గ్రాస్ రూ.221 కోట్లు) వసూలు చేసింది.

ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 70 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది.  ఈ చిత్రాన్ని 140 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. ఈ చిత్రాన్ని భారత్తోపాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్లలో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement