ఎన్టీఆర్‌ : తొలి షెడ్యూల్‌ పూర్తయ్యింది

 BalaKrishna Ntr Biopic First Schedule Completed - Sakshi

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్‌. చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా తేజ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో వాయిదా పడింది. తరువాత బాలయ్య హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించిన క్రిష్‌ సారధ్యంలో ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించారు. క్రిష్ స్టైల్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి ఫెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. షూటింగ్‌సెట్‌లో తీసిన ఓ ఫోటోను ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేసిన క్రిష్‌ తొలి షెడ్యూల్‌ పూర్తయ్యిందంటూ కామెంట్ చేశారు. బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్‌ రాజ్‌, సీనియర్‌ నరేష్‌లు కనిపించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top