హ్యాట్రిక్‌ కోసం హిట్‌ పెయిర్‌ | Balakrishna-Nayantara will be acting in pairs for the third time. | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ కోసం హిట్‌ పెయిర్‌

Jun 22 2017 10:44 PM | Updated on Aug 29 2018 1:59 PM

హ్యాట్రిక్‌ కోసం హిట్‌ పెయిర్‌ - Sakshi

హ్యాట్రిక్‌ కోసం హిట్‌ పెయిర్‌

యస్‌... బాలకృష్ణ–నయనతారల గురి ఇప్పుడు హ్యాట్రిక్‌ మీద ఉందట. హిట్‌ మూవీస్‌ ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’లతో హిట్‌ పెయిర్‌ అనిపించుకుందీ జంట.

యస్‌... బాలకృష్ణ–నయనతారల గురి ఇప్పుడు హ్యాట్రిక్‌ మీద ఉందట. హిట్‌ మూవీస్‌ ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’లతో హిట్‌ పెయిర్‌ అనిపించుకుందీ జంట. ఇప్పుడు మూడోసారి జంటగా నటించనున్నారని సమాచారం. బాలకృష్ణ 102వ చిత్రం త్వరలో ఆరంభం కానుంది. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారు? అనే డిస్కషన్‌కు గురువారం ఫుల్‌స్టాప్‌ పడింది.

ఎందుకంటే, నయనతారను దాదాపు ఖరారు చేసేశారు. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఈ ఆరేళ్లలో నయనతార ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తున్నారు. మరి.. డేట్స్‌ లేని కారణంగానో, తెలుగు నుంచి మంచి సబ్జెక్టులు రాకపోవడంవల్లో టాలీవుడ్‌కి దూరంగా ఉంటున్నారామె. బాలకృష్ణతో రెండు సినిమాలు చేయడంవల్ల, కథ నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ చిత్రానికి ‘జయసింహా’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, ఆగస్ట్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement