బాలా నాచియార్‌ మొదలైంది | Bala to direct Jyothika in Suriya's next production? | Sakshi
Sakshi News home page

బాలా నాచియార్‌ మొదలైంది

Mar 2 2017 3:20 AM | Updated on Sep 18 2019 2:56 PM

బాలా నాచియార్‌ మొదలైంది - Sakshi

బాలా నాచియార్‌ మొదలైంది

ఒక సంచలన చిత్రానికి శ్రీకారం జరిగింది. దర్శకుడు బాలా ఈ పేరు వైవి«ధ్యానికి మారు పేరు. ఒక నందా, పితామగన్, నాన్‌కడవుల్, పరదేశి లాంటి విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్‌ ఆయనే.

ఒక సంచలన చిత్రానికి శ్రీకారం జరిగింది. దర్శకుడు బాలా ఈ పేరు వైవిధ్యానికి మారు పేరు. ఒక నందా, పితామగన్, నాన్‌కడవుల్, పరదేశి లాంటి విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్‌ ఆయనే. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం తారైతప్పట్టై. సాధారణ కమర్షియల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించడం ఈయన హిస్టరీలో ఇప్పటి వరకూ జరగలేదు. అందుకే బాలా చిత్రాలకు ఆయన ముద్ర కచ్చితంగా ఉంటుంది. ఇక పెళ్లికి ముందు అనేక కమర్షియల్‌ చిత్రాల్లో నటించి యువత గుండెల్ని కొల్లగొట్టిన నటి జ్యోతిక. నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత నటనకు చిన్న విరామం ఇచ్చి మళ్లీ 36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం మగళీర్‌ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు.

 కథానాయకి ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాల్లోనే నటించాలన్న నిర్ణయంతో ముందుకు సాగుతున్న జ్యోతిక తాజాగా సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఇది నిజంగా రేర్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. ఇందులో యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ముఖ్య పాత్ర పోషించనుండడం మరో విశేషం. కాగా దర్శకుడు బాలా తన బీ.స్టూడియోస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో ప్రత్యేకత సంగీత జ్ఞాని ఇళయరాజా.

ఈయన సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రానికి నాచియార్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాగా ఇది సైకో థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని, ఇందులో జ్యోతిక పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సైకోగా నటుడు జీవీ నటిస్తున్నట్లు టాక్‌. చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి సెప్టెంబర్‌ నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement