తమిళ దర్శకుడితో 101వ చిత్రం.? | Bala Krishna 101 New movie with K S Ravikumar | Sakshi
Sakshi News home page

తమిళ దర్శకుడితో 101వ చిత్రం.?

Feb 9 2017 12:16 PM | Updated on Sep 5 2017 3:18 AM

తమిళ దర్శకుడితో 101వ చిత్రం.?

తమిళ దర్శకుడితో 101వ చిత్రం.?

తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించిన బాలకృష్ణ ఘనవిజయం సాధించాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన

తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించిన బాలకృష్ణ ఘనవిజయం సాధించాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ప్రతిష్టాత్మక చిత్రం తరువాత చేయబోయే సినిమా కావటంతో అదే జోరును కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు.

అందుకే రెండు, మూడు సినిమాలను పరిశీలనలో పెట్టాడు. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంప్రదిస్తున్నారు. ఆయన అంగీకరిస్తేనే రైతు సినిమా ఉంటుందని లేని పక్షంలో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడు.

అదే సమయంలో తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసే రవికుమార్, తెలుగులోనూ ఒకటి, రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు. పక్కా కమర్షియల్ సినిమాలను అందించటంలో స్పెషలిస్ట్గా పేరున్న రవికుమార్ బాలయ్య బాడీలాంగ్వేజ్కు తగ్గ కథ రెడీ చేశాడట. రైతు సినిమా లేని పక్షంలో రవికుమార్ సినిమానే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement