బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

Baba Bhaskar Gets Emotional In Fifth Week Nomination Process - Sakshi

ఆదివారం వస్తే ఎలిమినేషన్స్‌తో బయపడే హౌస్‌మేట్స్‌.. సోమవారానికి నామినేషన్‌ ప్రక్రియతో హడలెత్తిపోతారు. ఎవరు ఎవరిని నామినేట్‌ చేస్తారు.. ఏ కారణాలతో నామినేట్‌ చేస్తారు.. ఎవరిని నామినేట్‌ చేయాలని ఇలా హౌస్‌మేట్స్‌ ఆలోచిస్తూ ఉంటారు. సరైన కారణాలను చెబుతూ కొందరు నామినేట్‌ చేయగా.. ఎలాంటి కారణాలు లేకుండా చిన్న చిన్న విషయాలను చూపిస్తూ మరికొందరు నామినేట్‌ చేస్తుంటారు. (బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!)

అయితే ఇప్పటికి బిగ్‌బాస్‌లో నాలుగు వారాలు గడవగా.. నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు. హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణిలు బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడగా.. ఇంటి నుంచి బయటకు పంపే ఐదో వ్యక్తి కోసం నామినేషన్‌ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నామినేషన్‌ ప్రక్రియలో బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనికి గానూ బాబా భాస్కర్‌ కంటతడి పెట్టినట్టు కనబడుతోంది. అయితే హౌస్‌మేట్స్‌ చెప్పిన కారణాలకు అతను బాధపడ్డాడా? అంతలా ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నాడు అనేది చూడాలి. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉండే.. పునర్నవి-రాహుల్‌లు నామినేషన్‌ ప్రక్రియతో శత్రువులుగా మారేట్టు కనిపిస్తోంది. ఈ వారానికి పునర్నవి రాహుల్‌ను నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి నామినేషన్‌ ప్రక్రియలోనే ఇన్ని మలుపులు ఉంటే.. ఈ వారం మొత్తం బిగ్‌బాస్‌ ఇంకెలా ఉండబోతోందో చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top