ఒకే వేదికపై బాహుబలి, పెళ్లిచూపులు | Baahubali, pellichoopulu at iffm | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై బాహుబలి, పెళ్లిచూపులు

Aug 2 2017 3:53 PM | Updated on Sep 17 2017 5:05 PM

ఒకే వేదికపై బాహుబలి, పెళ్లిచూపులు

ఒకే వేదికపై బాహుబలి, పెళ్లిచూపులు

భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. రీజినల్ సినిమా వంద కోట్లు

భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. రీజినల్ సినిమా వంద కోట్లు వసూళు చేస్తేనే గగనం అనుకుంటున్న సమయంలో ఏకంగా 1500 కోట్లకు పైగా కొల్లగొట్టి తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేసింది ఈ సినిమా. అయితే ఇంతటి భారీ చిత్రంతో పాటు సమానం గౌరవాన్ని పొందింది ఓ చిన్న సినిమా.

త్వరలో మెల్బోర్న్లో జరగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బాహుబలితో పాటు మరో తెలుగు సినిమా పెళ్లిచూపులును కూడా ప్రదర్శించినున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే మెల్బోర్స్ ఫిలిం ఫెస్టివల్లో పలు భారతీయ భాషలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటిలో తెలుగు నుంచి బాహుబలి, పెళ్లిచూపులు చిత్రాలు మాత్రమే ఎంపికయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement