బాహుబలి 2 ట్రైలర్ రెడీ అయ్యిందోచ్

బాహుబలి 2 ట్రైలర్ రెడీ అయ్యిందోచ్ - Sakshi


సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన రాజమౌళి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెడీ అయిపోయిన ట్రైలర్ ను ఫైనల్ గా తెరపై ఎలా ఉందో పరీక్షిస్తున్నారు. ఈ విషయన్నా చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ట్రైలర్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ సందర్భంగా తెరపై ట్రైలర్ ఎలా ఉందో పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు సెంథిల్. 'అన్నపూర్ణ స్టూడియోస్ లో బాహుబలి 2 ట్రైలర్ పై వర్క్ చేస్తున్నాము. సీవీ రావ్, శివకుమార్ లతో కలిసి తెర అంతా సరిగా వస్తుందో లేదో పరీక్షిస్తున్నాము' అంటూ కామెంట్ చేశాడు. అంటే మరో వారం, పదిరోజుల్లో బాహుబలి 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top